మొదటి రోజు నుంచి అండగా ఉన్నారు:ఈటల

తాజా వార్తలు

Published : 18/10/2020 03:37 IST

మొదటి రోజు నుంచి అండగా ఉన్నారు:ఈటల


 

హైదరాబాద్‌: నగరంలో భారీగా కురుస్తున్న వర్షాలు, కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యంపై ఆ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, అధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో 165 క్యాంపులు, మరో 46 మొబైల్‌ హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. కరోనా నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో సుమారు 16 వేల మందికి కొవిడ్‌ పరీక్షలు చేసి, అవసరమైన మందులు అందించామని అధికారులు మంత్రికి తెలిపారు. అలాగే క్యాంపుల్లో 2 వేల మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు చెప్పారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ.. కరోనా కట్టడి, చికిత్సలో కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. ‘‘కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలకు అండగా నిలిచారు. అలాగే వరదల కష్టకాంలోనూ ప్రజలకు అండగా ఉండాలి. రాష్ట్రం, జీహెచ్ఎంసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలి. విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీరు, వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి’’ అని ఈటల తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని