శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Published : 02/09/2020 10:24 IST

శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అచ్చెన్నకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై జూన్‌ 12న అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ అదుపులో ఉన్నప్పుడు అచ్చెన్న ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స చేశారు. ఈ క్రమంలో అచ్చెన్న కరోనా బారిన పడ్డారు. అనంతరం ఐదు రోజుల క్రితం అచ్చెన్నకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని