₹200 ఖర్చు.. లక్షాధికారి అయిన రైతు..!

తాజా వార్తలు

Published : 08/12/2020 02:07 IST

₹200 ఖర్చు.. లక్షాధికారి అయిన రైతు..!


ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌‌: కేవలం రూ.200 పెట్టి భూమిని లీజుకు తీసుకున్న ఓ రైతును అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పన్నాకు చెందిన 45 ఏళ్ల రైతు లఖన్‌ యాదవ్‌ నవంబర్‌లో రూ.200 పెట్టి కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా శనివారం భూమిని కొంతవరకు తవ్వాడు. ఈ క్రమంలో అతడికి ఓ రాయి దొరికింది. 

గులకరాయిని పోలిన ఆ రాయి కొంచెం భిన్నంగా ఉండడంతో దాన్ని ఆ జిల్లా వజ్రాల అధికారికి చూపించాడు. దీంతో అది రాయి కాదు 14.98 క్యారెట్ల వజ్రం అని తేలింది. దీని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని తేలడంతో ఆ రైతు ఆనందం హద్దులుదాటింది. వజ్రం ద్వారా వచ్చిన డబ్బులను తన పిల్లల భవిష్యత్‌కు వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. తాను పెద్దగా చదువుకోలేదని, పిల్లల చదువుకోసం ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానని వివరించాడు. భూమిలో మరో వజ్రం దొరుకుతుందనే నమ్మకంతో ఇంకొన్ని నెలల పాటు అక్కడే పని కొనసాగించనున్నట్లు యాదవ్‌ తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని