నాగాలాండ్‌ భారత్‌లో లేదట..!!

తాజా వార్తలు

Published : 10/10/2020 18:51 IST

నాగాలాండ్‌ భారత్‌లో లేదట..!!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ చిక్కుల్లో పడింది. ఓ వినియోగదారుడికి ఇచ్చిన సమాధానంలో నాగాలాండ్‌ భారత్‌లో లేదంటూ పేర్కొనడంతో విమర్శలు ఎదుర్కొంది. నెటిజన్ల నుంచి వచ్చిన ట్రోల్స్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ రాష్ట్రానికి డెలివరీలను కూడా ప్రారంభించింది.

తమ రాష్ట్రానికి వస్తువులను ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ నాగాలాండ్‌కు చెందిన ఓ వినియోగదారుడు ఫేస్‌బుక్‌ వేదికగా ఫ్లిప్‌కార్ట్‌ను ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ తాము భారత్‌ వెలుపల సేవలందించలేమని పేర్కొనడం విమర్శలకు తావిచ్చింది. దీంతో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌ను ఓ ఆట ఆడుకున్నారు.

‘నాగాలాండ్‌కు ఫ్లిప్‌కార్ట్‌ స్వాతంత్ర్యం ఇచ్చింది’. ‘నాగాలాండ్‌ భారత్‌లో భాగం కాదట!?’ ‘చిన్నప్పుడే చదువుకుంటే తెలుస్తుంది’ అంటూ కామెంట్లు పెట్టారు. ట్రోల్స్‌ మొదలైన కాసేపటికే తన సమాధానాన్ని ఫ్లిప్‌కార్ట్‌ డిలీట్‌ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ జరిగిన పొరపాటుకు క్షమాపణai చెప్పింది. అంతేకాదు నాగాలాండ్‌ సహా దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని