హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్‌

తాజా వార్తలు

Published : 12/09/2020 16:33 IST

హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్‌

హైదరాబాద్‌: ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోలుకున్నారు. తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకోగా.. ఈ నెల 5న పాజిటివ్‌గా తేలినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పటినుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న హరీశ్‌రావు కోలుకున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ త్వరలోనే ఆయన హాజరు కానున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని