కూల్చివేతపై మీడియాకు బులిటెన్‌ ఇస్తాం: ఏజీ

తాజా వార్తలు

Updated : 24/07/2020 16:53 IST

కూల్చివేతపై మీడియాకు బులిటెన్‌ ఇస్తాం: ఏజీ

 

హైదరాబాద్‌:  తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కూల్చివేత వివరాలతో మీడియాకు బులిటెన్‌ ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కూల్చివేత వద్దకు ఎవరినీ వెళ్లనీయవద్దని నిబంధనలు చెబుతున్నాయని ఏజీ కోర్టుకు వివరించారు.మరోవైపు బులిటెన్‌లో వివరాలు సమగ్రంగా ఉండవని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం టూర్‌ ఏర్పాటు చేసి మీడియాను తీసుకెళ్లగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జర్నలిస్టులను అనుమతిస్తే వారికి ప్రమాదాలు జరగవచ్చని, అందరూ గుమిగూడి కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరగొచ్చని ఏజీ కోర్టుకు తెలిపారు. చుట్టు పక్కల ప్రైవేట్ భవనాలపై నుంచి కూడా చిత్రీకరించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేట్ భవనాలపై నుంచి చిత్రీకరిస్తే అడ్డుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణని రేపటికి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని