కూల్చివేత కవరేజీపిటిషన్‌పై విచారణ వాయిదా

తాజా వార్తలు

Published : 25/07/2020 16:30 IST

కూల్చివేత కవరేజీపిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి అనుమతివ్వాలన్న పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఇవాళ విచారణ జరిపారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. వీఐఎల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తరఫున సంస్థ భాగస్వాములు కాకుండా ఉద్యోగి పిటిషన్‌ దాఖలు చేయడం కుదరదన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం సంస్థ తరఫున ఉద్యోగి పిటిషన్‌ వేయవచ్చని, పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. అవసరమైతే సంస్థ యాజమాన్య ప్రతినిధులను చేరుస్తామన్నారు. ప్రభుత్వం కూడా కౌంటర్‌ దాఖలు చేయాలని తెలిపింది. ఏ ఉత్తర్వుల ప్రకారం సచివాలయం వద్ద పోలీసులను మోహరించారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని