రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ వాయిదా

తాజా వార్తలు

Published : 01/09/2020 14:24 IST

రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ వాయిదా

హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ అంశం సుప్రీంకోర్టు, ఎన్జీటీ పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని ప్రశ్నించింది.

డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్జీటీ అనుమతిచిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌లోని అన్ని అంశాలు అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందున్నాయని ఏపీ ఏజీ శ్రీరాం కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు పిటిషన్‌పై విచారణను హైకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని