మరింత తగ్గిన భారత్‌ కొవిడ్‌ మరణాల రేటు

తాజా వార్తలు

Published : 01/08/2020 18:20 IST

మరింత తగ్గిన భారత్‌ కొవిడ్‌ మరణాల రేటు

తొలిసారి 2.15 శాతానికి తగ్గిందన్న కేంద్రం

యాక్టివ్‌, రికవరీ కేసుల మధ్య అంతరం 5,29,271 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: భారత‌ కొవిడ్‌-19 మరణాల రేటు మరింత మెరుగైంది. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత తొలిసారి 2.15 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. జూన్‌లో ఇది 3.33 శాతంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. బాధితులను గుర్తించడం, పరీక్షించడం, చికిత్స చేయడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరణాల రేటు తగ్గించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని తెలిపింది.

‘కట్టుదిట్టంగా కంటైన్‌మెంట్‌ చేయడం,  పరీక్షలు నిర్వహించడం, ఏకీకృత, సమగ్ర విధానంతో చికిత్స చేయడంతో రోజుకు 30వేలకు పైగా కోలుకుంటున్నారు’ అని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల మంది కోలుకున్నారని వివరించింది. గత 24 గంటల్లో 36,569 మందికి నయమవ్వడంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 10.94 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. కొవిడ్‌-19 రికవరీ రేటు 64.5 శాతంగా ఉందని తెలిపింది.

కొవిడ్‌ 19 బాధితులు వేగంగా కోలుకోవడంతో యాక్టివ్‌ కేసులు, రికవరీ కేసుల మధ్య అంతరం 5,29,271కి చేరుకుందని కేంద్రం తెలిపింది. వీరంతా వైద్య వర్గాల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,755 కరోనా చికిత్స కేంద్రాల్లో 10,02,681 పడకలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు 273.85 లక్షల ఎన్‌95 మాస్క్‌లు, 121.5 లక్షల పీపీఈ కిట్లు, 1083.77 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, కేంద్ర ఆస్పత్రులకు పంపిణీ చేశామని వివరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని