మాస్కులు వైరస్‌ను అడ్డుకుంటాయి.. కానీ..

తాజా వార్తలు

Published : 23/10/2020 02:02 IST

మాస్కులు వైరస్‌ను అడ్డుకుంటాయి.. కానీ..

టోక్యో : ప్రస్తుత కరోనా కాలంలో మాస్కులు ధరించటం తప్పనిసరి అయింది. కొవిడ్‌ కట్టడిలో వీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్కులు వైరస్‌ను అడ్డుకుంటున్నా.. పూర్తిగా అయితే కాదని జపాన్‌కు చెందిన కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 

టోక్యో యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు చేసిన పరిశోధనలో మాస్కులు ఓ పరిధి వరకే వైరస్‌ను అడ్డుకుంటాయని వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్ర్తవేత్తలు ఓ ప్రత్యేక ఛాంబర్‌లో మనుషుల తలలను పోలిన బొమ్మ నిర్మాణాలను ఉంచారు. ఒక తలకు ఎదురుగా మరొకటి ఉంచి ఒక దానికి మాస్కు కట్టారు. ఎదురుగా ఉండే బొమ్మ నుంచి వైరస్‌ వచ్చేలా ఏర్పాటు చేశారు. మాస్కు లేని దాని కంటే కాటన్‌ మాస్కు ధరించటం వల్ల 40 శాతం వైరస్‌ను అడ్డుకున్నట్లు గుర్తించారు. ఎన్‌95 మాస్కులు అయితే 90 శాతం వరకూ వైరస్‌ను అడ్డుకున్నట్లు శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. అయినా కొన్ని వైరస్‌ కణాలు మాస్కు నుంచి లోనికి ప్రవేశించినట్లు అధ్యయనంలో వాళ్లు వివరించారు. 

ఈ క్రమంలో మాస్కులు కట్టిన బొమ్మ తల నోటి భాగం నుంచి వైరస్‌ను బయటికి వచ్చేలా చేయగా మాస్కు 50 శాతం వరకూ వైరస్‌ను అడ్డుకున్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. వైరస్‌ బారిన పడే వ్యక్తికి, వైరస్‌ను వ్యాప్తి చేసే వ్యక్తికి మధ్య మాస్కు ధరించటం గొప్ప ప్రభావం చూపుతోందని బుధవారం ప్రచురితమైన ఈ అధ్యయనం వివరిస్తోంది.  దీంతో పాటు జపాన్‌కు మరో శాస్ర్తవేత్తల బృందం గాలిలో వైరస్‌ వ్యాప్తిపై అధ్యయనం చేశారు. సూపర్‌కంప్యూటర్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తేమ శాతం ఉన్న వాతావరణంలో వైరస్‌ కణాలు విచ్ఛిన్నం అయినట్లు విశ్లేషించారు.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని