కొవిడ్‌ కూరలు.. మాస్కు రోటీలు

తాజా వార్తలు

Published : 04/08/2020 00:52 IST

కొవిడ్‌ కూరలు.. మాస్కు రోటీలు

కరోనాపై అవగాహన కల్పించేందుకు వినూత్న యత్నం

జోద్‌పూర్‌(రాజస్థాన్‌): ప్రపంచమంతా ఇప్పడు కరోనామయం. ఈ మహమ్మారి ధాటికి అనేక వ్యాపారాలు నిలిచిపోయాయి. ఈ సవాళ్ల నుంచే కొందరు అవకాశాల్ని వెతుక్కుంటూ వినూత్న రీతిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ కోవలోకే రాజస్థాన్‌లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం వచ్చింది. కరోనాపై అవగాహన కల్పించేలా కొవిడ్‌ కూరలు, మాస్కు రోటీలను అందిస్తూ  వినియోగదారులను ఆకర్షిస్తోంది. 
రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌ యాజమాన్యం సృజనాత్మక ఆలోచన ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా అందరి నోట నానుతున్న కరోనా వైరస్‌ పేరుతో రకరకాల వంటలను వేదిక్‌ రెస్టారెంట్ తయారు చేస్తోంది. వంటశాలలో తయారు చేసే కర్రీలను వైరస్‌ ఆకారంలో అలంకరించి ఆహార ప్రియులను ఆకట్టుకునేలా  రుచులను అందిస్తోంది. ఇక్కడ తయారు చేసే వంటకాలైన మలైకోప్తా కర్రీని కొవిడ్‌19గా అందించడంతో పాటు రోటీని మాస్కు ఆకారంలో వండి వార్చుతున్నారు. ఈ రెస్టారెంట్‌లో తయారైన కొవిడ్‌ కర్రీని తాము ఎంతో ఇష్టంగా తింటున్నట్లు ఆహార ప్రియులు చెబుతున్నారు. 
       ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రదర్శిస్తేనే ప్రజలు ఆకర్షితులవుతారని రెస్టారెంట్‌ యజమాని అనిల్‌కుమార్‌ చెబుతున్నారు. ఈ కర్రీని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు. మాస్కు ఆకారంలో తయారు చేసిన బటర్‌నాన్‌ను తినేందుకు ప్రజలు  ఆసక్తి కనబరుస్తున్నారని అనిల్ తెలిపారు. రెస్టారెంట్‌లో కొవిడ్‌ నిబంధనలతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని