ఎగిరొచ్చిన అతిథులు!

తాజా వార్తలు

Published : 02/12/2020 23:46 IST

ఎగిరొచ్చిన అతిథులు!


 

ఇంటర్నెట్ డెస్క్‌: అరుదైన అతిథుల ఆగమనంతో గుజరాత్‌లోని సూరత్‌ నగరం నూతన శోభను సంతరించుకుంది. ఆ అతిథులెవరో తెలుసా! ఎగిరివచ్చిన వలస పక్షులు. వీటి కిలకిలారావాలతో అక్కడి వీధుల్లో సందడి నెలకొంది. ఇవి ఏటా శీతాకాలంలో ఉత్తర ఆసియాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే అతిథులే. అయినప్పటికీ జంతుప్రేమికులు, ఇక్కడి ప్రజానీకానికి కనువిందు చేస్తున్నాయి. 2020 మిగిల్చిన చేదు జ్ఞాపకాల నడుమ.. సుదూరం నుంచి వచ్చిన ఈ స్నేహితుల సందడితో ఉపశమనం పొందుతున్నారు సూరత్‌ వాసులు. ఆత్మీయ అతిథులకు సాదర స్వాగతం తెలుపుతున్నారు. వాటికి ఆహారాన్నీ అందిస్తున్నారు. తమ ప్రేమను చాటుకుంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని