నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన ఈటల

తాజా వార్తలు

Published : 18/10/2020 03:37 IST

నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన ఈటల

హైదరాబాద్: ఇటీవల కరోనా సోకడంతో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఈటల కోరారు. నాయిని త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి వస్తారని అక్కడే ఉన్న ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సెప్టెంబర్‌ 30వ తేదీన నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని