ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ప్రారంభం

తాజా వార్తలు

Published : 16/07/2020 22:13 IST

ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌ను మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి సమక్షంలో మరో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కావాల్సిన సమాచారాన్ని పరిశ్రమల శాఖ ఈ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సరళతర వాణిజ్య విధానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ప్రమోషన్‌ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వెబ్‌సైట్‌లో పెట్టుబడి దారులకు అవసరమైన సంపూర్ణ సమాచారం అందించామన్నారు. మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం తరఫున ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో పలు సేవలకు సంబంధించిన లైవ్‌ లింక్‌లను ఉంచామని, తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకోవచ్చని చెప్పారు. భవిష్యత్‌లో ఈ వెబ్‌సైట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్‌సైట్‌ను రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని