ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేశారు: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 22/10/2020 16:07 IST

ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేశారు: లోకేశ్‌

అమరావతి: అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈ రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొనేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దేశం గర్వపడే స్థాయిలో నూతన రాజధానిని కట్టుకుంటున్నారని ప్రధాని సహా పొరుగు రాష్ట్రాల సీఎంలు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి ఆంధ్రులను అభినందించారని ఈ సందర్భంగా లోకేశ్‌ గుర్తు చేశారు. అయితే, అప్పడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ మాత్రం ఇంట్లో కూర్చొని విధ్వంసకర ఆలోచనలు చేశారని ఆరోపించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని