In Pics: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

తాజా వార్తలు

Updated : 29/08/2020 19:28 IST

In Pics: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

తిరుపతి: తిరుచానూరు రోడ్డులోని విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో వీధి వ్యాపారుల కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. వీరిని కట్టడి చేసేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో నిరుపయోగంగా ఉన్న కార్లను రహదారి పక్కన వరుసగా నిలపడంతో అక్రమ వ్యాపారాలకు చెక్‌పడడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య తీరింది. 


హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో ధన్వంతరి నారాయణ గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన యువతులు మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా ఫొటోలు దిగుతున్న దృశ్యం. 


తిరుపతి నుంచి తిరుమలకు రెండో ఘాట్‌లో నుంచి వెళ్తుండగా కనిపించే ఈ గోడ ఎత్తు 10 అడుగులు, పొడవు సుమారు 14 కిలోమీటర్లు. జంతుప్రదర్శనశాల నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉండే ఈ గోడను అడవిలోని జంతువులు, చెట్లను స్మగ్లర్ల బారి నుంచి కాపాడేందుకు నిర్మించారు. ఏడాది క్రితమే గోడ నిర్మాణం పూర్తయింది.


హైదరాబాద్‌:  జొన్న చేనులో పాలగింజలను తింటున్న పక్షి.. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ సమీపంలో ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది. 


గణపతి నవరాత్రుల్లో భక్తులు, సందర్శకులతో ఎంతో సందడిగా ఉండే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ కరోనా కారణంగా బోసిపోయింది. కొనుగోలుదారులు లేక దిగాలుగా వెళ్తున్న బెలూన్లు అమ్ముకునే మహిళ.


తల వెంట్రుకలను పువ్వు ఆకారంలో కత్తిరించుకున్న యువకుడు హైదరాబాద్‌ నాంపల్లిలో కనిపించగా ‘ఈనాడు’ కెమెరా తీసిన చిత్రమిది.


హైదరాబాద్: కరోనా సోకినవారు ఆక్సిజన్‌ థెరపీ ఇంట్లోనే చేసుకునేందుకు వీలుగా బాధిత కుటుంబ సభ్యులకు కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులు. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఓ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా అందజేస్తుంది. చికిత్స అనంతరం వీటిని స్వచ్ఛంద సంస్థకు తిరిగి ఇవ్వాలి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని