అమరావతి ప్రాంతంలో పోలీసుల మోహరింపు

తాజా వార్తలు

Updated : 19/08/2020 13:49 IST

అమరావతి ప్రాంతంలో పోలీసుల మోహరింపు

అమరావతి: ఏపీ మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా కరకట్ట, సీడ్‌ యాక్సిస్‌ రహదారి సహా సీఎం కాన్వాయి మార్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతికి మద్దతుగా మందడంలో దీక్షా శిబిరంలో కూర్చున్న మహిళలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. శాంతి యుత దీక్షలను అడ్డుకోవద్దని దండం పెట్టి అభ్యర్థించినా పోలీసులు కనికరించలేదని మహిళళు వాపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు, మహిళలు... తీవ్ర వాదుల్లో కలిసేందుకు అనుమతివ్వాలని త్వరలో రాష్ట్రపతికి లేఖలు రాస్తామని చెప్పారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. 

మాట్లాడితే కేసులు పెడుతున్నారు..
‘‘ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా. ప్రజాప్రతినిధులు ఏదైనా మాట్లాడొచ్చు కానీ, మేం మాట్లాడకూడదా?నిరసన తెలియజేయకూడదా?. మేము ఇచ్చిన భూములు మాత్రం అమ్ముకోడానికి రెడీగా ఉంటారు. అవి అమ్ముకుని వచ్చిన డబ్బును సంచుల్లో పెట్టుకుని విశాఖపట్నం ఎప్పుడు తీసుకెళ్దామా అని చూస్తున్నారు. రైతుల బాధ పట్టడం లేదు. ఏదైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. కరోనా సమయంలో శాంతి యుతంగా ఇళ్లలో నిరసన తెలిపినా కేసులు పెట్టారు. ఎన్నోసార్లు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటువైపు వెళ్లారు. ఏనాడైనా వారి కాన్వాయి ముందుకు వెళ్లి ‘‘జై అమరావతి’’ అని నినాదాలు చేశామా? ముఖ్యమంత్రిగారూ ఏంటి మా పరిస్థితి అని ఒక్కరైనా అడిగామా. శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు’’ అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని