చలికాలంలో కీళ్ల నొప్పులా.. ఇలా చేయండి..!

తాజా వార్తలు

Published : 13/12/2020 15:31 IST

చలికాలంలో కీళ్ల నొప్పులా.. ఇలా చేయండి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓ వైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెడతాయి. ఓ పట్టాన పైకి లేవలేని పరిస్థితి తలెత్తుతుంది. కీళ్లు బిగుసుకుపోవటం వల్ల ఉదయం మంచం దిగటం కూడా కష్టంగా మారుతుంది. అయితే సీజన్‌ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కీళ్ల నొప్పుల బాధ నుంచి చాలావరకు తప్పించుకోవచ్చు.

కీళ్ల కదలికలను కట్టిపడేసే సమస్య నుంచి ఉపశమనం కోసం శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇసుకను తీసుకుని కొద్దిగా వేడి చేసి, బట్టలో చుట్టి, నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయటం వల్ల కీళ్ల కదలికలు మృదువుగా మారతాయి. అంతేకాదు పోటెత్తే నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గోరు వెచ్చని నీటితో పాటు, చల్లటి నీటితో కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి పడుకునే సమయంలో మోకీళ్ల చుట్టూ క్రేప్‌ బ్యాండేజ్‌ చుట్టటం లేదా దిండును గానీ, టవల్‌ను గానీ ఉండలా చుట్టి మోకాళ్ల కింద పెట్టుకుంటే మంచిది.
నొప్పులు మరీ త్రీవంగా వేధిస్తున్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని