‘అల’వోకగా గిన్నిస్‌ రికార్డు బద్దలు.. వైరల్‌ వీడియో

తాజా వార్తలు

Published : 12/09/2020 19:18 IST

‘అల’వోకగా గిన్నిస్‌ రికార్డు బద్దలు.. వైరల్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రెజిల్‌ కు చెందిన మాయా గబేరియా అనే యువతి సర్ఫింగ్‌లో తాను నెలకొల్పిన గిన్నిస్‌ రికార్డును తానే బద్దలు కొట్టింది. 73.5 అడుగుల అతి పెద్ద అలపై సర్ఫింగ్‌ చేయటం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది. కాగా.. ఇదివరకు ఉన్న 68 అడుగుల రికార్డు కూడా ఆమె నెలకొల్పిందే కావటం విశేషం.

దీనికి సంబంధించిన 40 సెకెన్ల వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. నాలుగంతస్తుల భవనం కంటే ఎత్తయిన అలపై మాయా చేసిన సర్ఫింగ్ విన్యాసాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనిని చూసి ‘‘వావ్‌.. అద్భుతం.. కంగ్రాట్స్‌.. వాటే థ్రిల్‌ మాయా...’’ అంటున్న వారి పొగడ్తలు సాగర ఘోషను మించిపోతున్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని