శ్వాస విశ్లేషణ పరీక్షతో కొవిడ్‌ నిర్ధరణ!

తాజా వార్తలు

Updated : 21/10/2020 05:16 IST

శ్వాస విశ్లేషణ పరీక్షతో కొవిడ్‌ నిర్ధరణ!

సింగపూర్ : కరోనా వైరస్‌ను నిర్ధరించడానికి ఇప్పటికే చాలా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. స్వాబ్‌ తదితర పరీక్షల ద్వారా కొవిడ్‌ వైరస్‌ను నిర్ధరిస్తున్నారు. తాజాగా సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు శ్వాస విశ్లేషణ పరీక్ష ద్వారా కొవిడ్‌- 19 వైరస్‌ను నిర్ధారించే విధానాన్ని అభివృద్ధి చేశారు. నిమిషం లోపే ఫలితం వచ్చే ఈ పరీక్షక సంబంధించి వీళ్లు 180 మందిని పరీక్షించారు. ఇందులో 90 శాతం కచ్చితత్వం నమోదైందని పరిశోధకులు వివరించారు.

ఓ పరికరంలోకి గాలిని ఊదటం ద్వారా వైరస్‌ నిర్ధరణ అయ్యేలా దీన్ని రూపొందించారు. మానవ కణాల్లో జీవరసాయన చర్యల వల్ల వోలటైల్‌ ఆర్గానిక్‌ పదార్థాలు(వీఓసీ) ఏర్పడుతాయి. ఇలా మనం పరికరంలోకి ఊదిన గాలిలోని వీఓసీలను పరికరంలోని స్పెక్ట్రో మీటర్‌ గుర్తించి వైరస్‌ను నిర్ధారిస్తుంది.

ఈ పరీక్ష ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు సింగపూర్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. వేగం, కచ్చితమైన కరోనా పరీక్ష నిర్ధరణకు ఈ విధానం జవాబుగా దొరికిందని వివరించింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ ఈ దేశంలో సుమారు 58 వేల మంది కరోనా బారిన పడ్డారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని