కరోనా నియంత్రణకు సింగరేణి చర్యలు

తాజా వార్తలు

Published : 21/07/2020 20:25 IST

కరోనా నియంత్రణకు సింగరేణి చర్యలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణ, చికిత్సలకు సింగరేణి చర్యలు చేపట్టింది. సీఈఆర్‌ క్లబ్బులు, పాఠశాలలను క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించాలని నిర్ణయించింది. ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా ఐసీయూ వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హైదరాబాద్‌లోని 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతో అంగీకారం కుదుర్చుకున్నట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది.. వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా, బేసిక్‌పై 10 శాతం అలెవెన్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కొన్నాళ్లు గనులు మూసివేయాలని సింగరేణి నిర్ణయించింది. కార్మిక సంఘాల గేట్‌ మీటింగ్‌లకు 2 నెలలపాటు అనుమతి లేదని చెప్పింది. కరోనా సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌ సెలవులు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని