ఎలుగుబంటి వచ్చి నిద్రలేపితే..!

తాజా వార్తలు

Published : 16/09/2020 01:08 IST

ఎలుగుబంటి వచ్చి నిద్రలేపితే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంతంగా నిద్రపోతున్న ఓ వ్యక్తిని అక్కడకు వచ్చిన ఓ ఎలుగుబంటి నిద్రలేపిన సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వింతైన ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో చోటుచేసుకుంది. మాథ్యూ బేట్‌ అనే వ్యక్తి ఓ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద హాయిగా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలోకి మెల్లగా ఓ ఎలుగుబంటి వచ్చింది. పూల్‌ వద్ద తిరుగుతూ అందులో నీరు కూడా తాగింది. అనంతరం బేట్‌ వద్దకు వచ్చి వాసన చూసింది. అతను కదలక పోవటంతో అది అతని కాలిని తన చేతితో తాకుతూ మెల్లగా తట్టి లేపింది. దీనితో నిద్ర నుంచి లేచి, షాక్‌ తినటం బేట్‌ వంతయింది! కాగా, అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని