దానిమ్మ వ్యర్థాలను ఏం చేయాలో చెప్పండి..

తాజా వార్తలు

Published : 02/10/2020 00:44 IST

దానిమ్మ వ్యర్థాలను ఏం చేయాలో చెప్పండి..

పరిష్కారం కోసం ఛాలెంజ్‌ విసిరిన ది వండర్‌ఫుల్‌ కంపెనీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండ్ల రసం చేయడం చాలా సులభం. తాజా పండ్లను కట్‌ చేసి మిక్సీలో వేసి కాస్త చక్కెర కలిపేస్తే జ్యూస్‌ రెడీ. మరి పండ్ల వ్యర్థాల సంగతి? ఏముంది తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడమే అంటారా? ఇంట్లో పండ్ల రసాలు తయారు చేసే వారి దగ్గరి నుంచి జ్యూస్‌లు తయారు చేసే పెద్ద కంపెనీల వరకూ వ్యర్థాలను ఇలాగే పారేస్తున్నారు. అయితే ఇలా వృథా అయిపోతున్న దానిమ్మ పండ్ల వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ఉపాయాన్ని సూచించమని అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. మంచి ఆలోచన చేసిన వారికి భారీ మొత్తంలో నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. 

ఆహార రంగంలో ప్రముఖ సంస్థ ‘ది వండర్‌ఫుల్ కంపెనీ’ కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌ కేంద్రంగా నడుస్తోంది. దీనికి దానిమ్మ పండ్ల రసం తయారు చేసే ‘పోమ్‌ వండర్‌ఫుల్‌’అనే అనుబంధ సంస్థ కూడా ఉంది. పండ్ల రసం కోసం ఈ కంపెనీ ఏటా దాదాపు 50వేల టన్నుల వరకు దానిమ్మ పండ్లను వినియోగిస్తుంటుంది. ఫ్యాక్టరీలో ఉండే యంత్రాలే పండ్ల తోలు,  గింజలను తొలగించి.. రసాన్ని వేరు చేస్తాయి. అలా రసం తయారు చేసే క్రమంలో మిగిలిన పండ్ల వ్యర్థాలను కంపెనీ పారేస్తుంటుంది.

తాజాగా ఆహార వృథాను అరికట్టేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘రీఫెడ్‌’తో కలిసి ఈ కంపెనీ ‘వండర్‌ఫుల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ను ప్రారంభించింది. తమ సంస్థ వినియోగించే దానిమ్మపండ్ల నుంచి వచ్చే వ్యర్థాలు దేనికైనా ఉపయోగపడే విధంగా పరిష్కారం కనుగొనాలని ప్రజలకు ఆహ్వానం పలికింది. వ్యక్తిగతంగా లేదా బృందంగా ఏర్పడి పరిష్కారం కనుగొన్న వారికి 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 7.3 కోట్లు) నగదు బహుమతి ఇస్తామని వెల్లడించింది. డిసెంబర్‌ 7వ తేదీ తుది గడువుగా పేర్కొంది. పరిష్కారం చూపిన వారికి దాన్ని ఆచరణలో పెట్టడానికి కావాల్సిన వనరులు తామే సమకూరుస్తామని వండర్‌ఫుల్‌ సంస్థ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని