స్థానికులకే సర్వదర్శనం టోకెన్లు: తితిదే

తాజా వార్తలు

Published : 18/12/2020 01:41 IST

స్థానికులకే సర్వదర్శనం టోకెన్లు: తితిదే

తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల దర్శనార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఈవో వెల్లడించారు. తిరుపతిలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో చెప్పారు. అలాగే 24న తిరుపతి స్థానికులకు మాత్రమే సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 25, 26 తేదీలు, జనవరి 1న సిఫారసు లేఖలను అనుమతించేది లేదని ఈవో వెల్లడించారు. తిరుమలకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి వారిని అనుమతించనున్నట్లు తెలిపారు.  ప్రముఖులతో పాటు వారి కుటుంబసభ్యులు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని