గాయపడిన నాగుపాముకు చికిత్స!

తాజా వార్తలు

Published : 14/12/2020 01:50 IST

గాయపడిన నాగుపాముకు చికిత్స!

పాడేరు: సాధారణంగా పాములు అంటేనే చాలామంది భయపడుతుంటారు. మరికొందరు అవి కనిపిస్తే చాలు తమకు హాని చేస్తాయేమోనని చంపేస్తుంటారు. కానీ ఆ జంతు ప్రేమికుడు మాత్రం ఔదార్యం చాటుకున్నాడు. గాయపడిన పాముకు చికిత్స చేయించాడు. వివరాల్లోకి వెళితే...

విశాఖ జిల్లా పాడేరు.. వెంకటగిరి వీధిలో ఓ ఇంటి నిర్మాణం జరుగుతుండగా అక్కడే ఉన్న నాగుపాముకు గునపం తగిలి గాయమైంది. ఆ సమాచారం భాస్కర్‌ అనే జంతు ప్రేమికుడికి తెలిసింది. అతడు ఆ పామును పట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దానికి చికిత్స చేయించాడు. దెబ్బ తగిలిన చోట కట్టు కట్టించాడు. అనంతరం మినుములూరు కొండల్లో సురక్షితంగా విడిచిపెట్టాడు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని