జంతువుల కోసమూ ఓ వంతెన

తాజా వార్తలు

Published : 03/12/2020 10:40 IST

జంతువుల కోసమూ ఓ వంతెన

ఉత్తరాఖండ్‌ అటవీశాఖ వినూత్న ఆలోచన

డెహ్రాడూన్‌: నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే రహదారిని దాటుతూ సరీసృపాలు, జంతువులు మృతిచెందుతుండటంతో ఆ సమస్యను అధిగమించేందుకు ఉత్తరాఖండ్‌ అటవీశాఖ వినూత్న ఆలోచనకు తెరలేపింది. రహదారిపై జంతువుల రాకపోకల కోసం బ్రిడ్జ్‌ నిర్మించింది. నైనిటాల్‌ జిల్లా రాంనగర్‌ అడవిలోని కలదుంగి-నైనితాల్‌ రహదారి మధ్యలో 90 ఫీట్ల పర్యావరణహిత బ్రిడ్జిని నిర్మించింది. వెదురు కర్రలు, జూట్‌, గడ్డితో వంతెనను రూపొందించింది. 40 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుగల వంతెన నిర్మాణం కోసం రూ.2 లక్షలు ఖర్చయ్యింది. కేవలం పది రోజుల్లో ఆ బ్రిడ్జిని పూర్తిచేశారు. 

జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పర్యావరణహిత వంతెన ముగ్గురు వ్యక్తుల బరువును కూడా ఆపగలుగుతుంది. సరీసృపాలే కాకుండా చిరుతల్లాంటి జంతువులు రోడ్డు దాటేందుకు ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు కలదుంగి-నైనిటాల్‌ రహదారి గుండా రాకపోకలు సాగిస్తాయి. అయితే ఆ అటవీ ప్రాంతంలో జీవించే సరీసృపాలతోపాటు కోతులు, ఉడతలు ఇతర జంతువులు రోడ్డు దాటుతూ మృతిచెందుతున్నాయి. ఈ ప్రమాదాల నుంచి జంతువులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ఈ తరహా ప్రయత్నం చేశారు. ఉత్తరాఖండ్‌ అటవీశాఖ అధికారి వైభవ్‌సింగ్‌ వంతెన ఫొటోలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. జంతువుల శ్రేయస్సు కోసం అధికారులు తీసుకున్న ఈ చర్యలపట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని