శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన సందర్శకులు

తాజా వార్తలు

Published : 02/10/2020 17:25 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన సందర్శకులు

సున్నిపెంట సర్కిల్‌: శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకులు పోటెత్తారు. జలాశయానికి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ఐదు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను చూసేందుకు  తరలివస్తున్నారు. గాంధీ జయంతి సెలవు.. శని, ఆదివారాలు కలిసి రావడంతో కార్లు, ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం రహదారులు సందర్శకుల వాహనాలతో రద్దీగా మారాయి. జలదృశ్యాలను చూసేందుకు పలువురు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని