ఆధార్‌ కలిపిన బంధం

తాజా వార్తలు

Published : 14/07/2021 01:16 IST

ఆధార్‌ కలిపిన బంధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్ నమోదు.. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలుడిని తన తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఆధార్ ఆ బాలుడి జీవితానికి ఆధారంగా నిలిచింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని  ఓ ఇంటి నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని చేరదీసిన వ్యక్తి, ఆధార్ సాయంతో అతని తల్లిదండ్రులను గుర్తించారు వాళ్లకు అప్పగించాడు.   

2011లో నాగపూర్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు ఓ బాలుణ్ని తప్పిపోయినట్లుగా గుర్తించి అనాథ ఆశ్రమంలో చేర్పించారు. 2015లో ఆ ఆశ్రమాన్ని మూసివేశారు.  దామ్లే అనే వ్యక్తి ఆ బాలుణ్ని దత్తత తీసుకుని అమన్‌ అని నామకరణం చేశారు. తన ఇద్దరి పిల్లలతో సమానంగా పెంచారు. ప్రస్తుతం అమన్‌ పదో తరగతి చదువుతుండగా... పాఠశాలలో ఆధార్‌ నెంబర్‌ అవసరం అయ్యి ఆధార్‌ నమోదు చేయడానికి ప్రయత్నించారు. అయితే అమన్‌ వేలిముద్రలతో ఇప్పటికే ఆధార్‌ నమోదు చేసి ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. నాగ్‌పూర్‌ యూఐడీఐ కార్యాలయాన్ని సంప్రదించగా మహ్మద్‌ అమీర్‌ పేరుతో ఆధార్‌ నమోదైనట్టు గుర్తించారు. ఆ ఆధార్‌లో ఉన్న చిరునామా ఆధారంగా మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్‌కు చెందిన అమీర్‌ కుటుంబ సభ్యులకు దామ్లే సమాచారం అందించారు. వారిని నాగ్‌పూర్‌కు రప్పించి, అమీర్‌ను వాళ్లకు అప్పగించారు. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమారుడు మళ్లీ దొరకడంతో అమీర్‌ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని