ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Published : 17/08/2020 21:29 IST

ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు

గుంటూరు: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు రమేశ్‌ ఆస్పత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో అరెస్టయిన అచ్చెన్నాయుడు.. అనారోగ్యం కారణంగా రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అచ్చెన్నాయుడికి కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రమేశ్‌ ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయన్ను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని