ap news: శ్రీవారి భక్తులకు మరో అవకాశం

తాజా వార్తలు

Updated : 06/06/2021 20:54 IST

ap news: శ్రీవారి భక్తులకు మరో అవకాశం

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులు వారి దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పించింది తితిదే. టికెట్లు పొంది కరోనా ప్రభావంతో స్వామి దర్శనానికి భక్తులు రాలేకపోతున్నట్టు తితిదే గుర్తించింది. దీంతో జూన్‌ 30 వరకు ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను పొందిన యాత్రికులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని తితిదే ప్రకటించింది. ఏడాది సమయంలో ఎప్పుడైనా దర్శన సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించిన తితిదే.. ఒక్కసారి మాత్రమే మార్పునకు అవకాశం ఇచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని