ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 03/08/2020 01:20 IST

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి కరోనా పాజిటివ్‌

వీడియో ద్వారా వెల్లడించిన కోన రఘుపతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో‌ కరోనా వ్యాప్తి  కొనసాగుతోంది. సాధారణ పౌరుడి నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడ్డవారే. నిన్న కరోనాతో మాజీమంత్రి , భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏపీలోని పలువురు అధికార పార్టీ నాయకులకు కరోనా సోకింది. తాజాగా శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. పాజిటివ్‌ వచ్చినట్లు కోన రఘుపతి వీడియో ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ బాధపడవద్దని సూచించారు. వైద్యుల సూచన మేరకు వారం పాటు హోంక్వారంటైన్‌లో ఉంటానని పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని