AP Corona: ఏపీలో కొత్తగా 2,100 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 05/07/2021 17:33 IST

AP Corona: ఏపీలో కొత్తగా 2,100 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,731 నమూనాలను పరీక్షించగా.. 2,100 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,05,023కి చేరింది. తాజాగా మరో 26 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 12,870కి పెరిగింది. తాజాగా 3,435 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 33,964 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,24,35,809 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని