ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు
close

తాజా వార్తలు

Updated : 27/07/2020 18:08 IST

ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,051 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349 కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1210కేసులు, గుంటూరు జిల్లాలో 744 కేసులు వచ్చాయి. ప్రస్తుతం 51,701 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 49,558 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 49 మంది మృతి చెందారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది మంది, విశాఖ జిల్లాలో ఎనిమిది, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కృష్ణ జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,090కి చేరింది. ఒక్క రోజులో 43,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తంగా 16,86446 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని