‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వండి: సచివాలయ ఉద్యోగులు

తాజా వార్తలు

Published : 19/04/2021 16:49 IST

‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వండి: సచివాలయ ఉద్యోగులు

అమరావతి: కరోనా ఉద్ధృతి దృష్ట్యా వర్క్‌ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అనంతరం సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. గతేడాది ఇద్దరు.. ఇప్పుడు నలుగురు సచివాలయ ఉద్యోగులు కొవిడ్‌తో మృతిచెందారని సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌. ప్రసాద్‌ చెప్పారు. తాజాగా మూడు రోజుల్లోనే నలుగురు మరణించినట్లు తెలిపారు. కరోనా తీవ్రత వల్ల తామంతా భయపడుతున్నామన్నారు. 40-50 శాతం ఉద్యోగులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని.. వర్క్‌ ఫ్రం హోంకు అవకాశమివ్వాలని సీఎస్‌ను కోరినట్లు తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉందని.. ఉద్యోగులమంతా భయాందోళనతో ఉన్నామని సచివాలయ సంఘం నేత సుజాత చెప్పారు. పద్మారావు అనే ఉద్యోగిని మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. కొవిడ్‌ మహమ్మారితో నలుగురు ఉద్యోగులను కోల్పోయామని.. వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఉంటే కొంత వరకైనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని సచివాలయ సంఘం సంయుక్త కార్యదర్శి కోట రాజేశ్‌ అన్నారు. ఉద్యోగుల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

14 రోజుల క్వారంటైన్‌ సెలవులు ప్రకటించాలి: బొప్పరాజు

రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ప్రభుత్వ ఉద్యోగులు బలవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తక్షణమే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత, కరోనా ప్రొటోకాల్‌ పాటించేందుకు తక్షణమే సరిపడా నిధులను మంజూరు చేయాలని కోరారు. వైరస్‌ బారిన పడిన ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్‌ సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని