ap high court: సినీనటుడు మురళీ మోహన్‌ కుటుంబ సభ్యులపై తదుపరి చర్యలొద్దు: హైకోర్టు

తాజా వార్తలు

Published : 04/08/2021 18:14 IST

ap high court: సినీనటుడు మురళీ మోహన్‌ కుటుంబ సభ్యులపై తదుపరి చర్యలొద్దు: హైకోర్టు

అమరావతి: సినీనటుడు, జయభేరి ప్రాపర్టీస్‌ ఛైర్మన్‌ మురళీ మోహన్‌ కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. తన వద్ద స్థలం తీసుకుని మోసం చేశారని భూ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గురువారం విచారణకు హాజరు కావాలని సీఐడీ 41ఎ సెక్షన్‌ కింద నోటీసు ఇచ్చింది. సీఐబీ నోటీసులపై మురళీ మోహన్‌ కుటుంబ సభ్యులు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ వివాదంగా మార్చడం సరికాదన్నారు. భూ యజమానితో ఒప్పందాన్ని జయభేరి ప్రాపర్టీస్‌ ఉల్లంఘించలేదని దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. వాదనల అనంతరం ఈకేసులో అన్నిరకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని