వృద్ధుడి మృతదేహం ఘటనపై మంత్రి ఆగ్రహం 

తాజా వార్తలు

Updated : 24/02/2021 15:49 IST

వృద్ధుడి మృతదేహం ఘటనపై మంత్రి ఆగ్రహం 

అమరావతి: విజయనగరం జిల్లాలో వృద్ధుడి మృతదేహం ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న పార్వతీపురం నుంచి సాలూరు వెళుతున్న బస్సులో ఓ వృద్ధుడు మృతిచెందాడు. దీంతో బస్సు సిబ్బంది మార్గంమధ్యలోనే బొబ్బిలి వద్ద కుటుంబ సభ్యులతో సహా మృతదేహాన్ని దించేశారు. దీనిపై మంత్రి నాని స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీసీ ఎండీ, వీసీల నుంచి సేకరించారు. బస్సు సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో విజయనగరం, పార్వతీపురం డిపోల మేనేజర్‌లు వృద్ధుడి కుటుంబం వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని