ఆ వివాదం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రిస్తాం: వెల్లంపల్లి

తాజా వార్తలు

Updated : 13/06/2021 14:11 IST

ఆ వివాదం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రిస్తాం: వెల్లంపల్లి

బ్రహ్మంగారి మ‌ఠాధిప‌తిపై క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంటుందన్న మంత్రి 

ఎవ‌రూ వివాదాల‌కు పోవ‌ద్దని సూచ‌న‌

అమ‌రావ‌తి: క‌డ‌ప జిల్లాలోని బ్ర‌హ్మంగారి మ‌ఠం ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని.. మ‌ఠాధిప‌తి విష‌యంలో ఎవ‌రూ వివాదాల‌కు పోవ‌ద్ద‌ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. మ‌ఠాధిప‌తిపై గ‌త కొన్నిరోజులుగా వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. మ‌ఠాధిప‌తికి సంబంధించి ఎలాంటి వీలునామా అంద‌నందున ధార్మిక పరిష‌త్ త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు. మ‌ఠం నిర్వ‌హ‌ణ‌కు అధికారిని నియ‌మించిన‌ట్లు వెల్లడించారు. అక్క‌డి ఆచారాలు, సంప్ర‌దాయాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌రిత‌గ‌తిన సేక‌రిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

మ‌ఠాధిప‌తి కొవిడ్‌తో చ‌నిపోయినప్ప‌టి నుంచి తదుప‌రి వార‌సులు ఎవ‌రనే విష‌యంపై వివాదం జ‌రుగుతోంద‌ని మంత్రి అన్నారు. వార‌సుడిపై దివంగ‌త‌ మ‌ఠాధిప‌తి ముందుగానే వీలునామా రాసిన‌ట్లు చెబుతున్న‌ట్లు వివ‌రించారు. ఆయన ఇద్ద‌రు భార్య‌ల వార‌సులు పీఠం కోసం పోటీ ప‌డుతున్నార‌ని చెప్పారు. దేవాదాయ చ‌ట్టం ప్ర‌కారం వీలునామా రాసిన 90 రోజుల్లో ధార్మిక పరిష‌త్‌కు పంపాల్సి ఉంటుందని.. కానీ అది అంద‌లేద‌ని వెల్లంప‌ల్లి తెలిపారు. రాష్ట్రంలో 128 గుర్తింపు మ‌ఠాలు, పీఠాలు ఉన్నాయ‌ని.. మ‌ఠంలో మెజార్టీ స‌భ్యులు ఎవ‌రిని సూచిస్తే వారిని అక్క‌డ మ‌ఠాధిప‌తులుగా నియ‌మిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కాస్త స‌మ‌యం తీసుకొని క‌మిటీని ఏర్పాటు చేసి వివాదాన్ని సామ‌ర‌స్యంగా  ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. అంద‌రి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటామ‌ని.. మ‌ఠాధిప‌తులు తమ సూచ‌న‌లను ఉన్న‌తాధికారుల‌కు ఇవ్వొచ్చ‌ని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని