సైనిక నియామకాల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు!

తాజా వార్తలు

Updated : 15/03/2021 01:43 IST

సైనిక నియామకాల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు!

దిల్లీ: సైనిక నియామకాల్లో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు సైన్యం వెల్లడించింది. పంజాబ్‌లోని కపూర్తలా జిల్లాలోని ఓ సైనిక కేంద్రంలో అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు సైన్యం అంతర్గత నిఘాలో బయటపడింది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని సైన్యం కోరనున్నట్లు సమాచారం. ఓ జూనియర్‌ స్థాయి అధికారి ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరినీ వదిలేది లేదని ఆర్మీ చీఫ్‌ జనరల్ మనోజ్‌ ముకుంద్‌ నరవణె స్పష్టం చేశారు. అలాంటి వారికి పింఛను కూడా ఇవ్వకుండా సాగనంపుతామని హెచ్చరించారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని