మారుతీ కారును.. లంబోర్గినిలా మార్చేశాడు!

తాజా వార్తలు

Updated : 19/06/2021 16:36 IST

మారుతీ కారును.. లంబోర్గినిలా మార్చేశాడు!


(Photo: Lamborghini website)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కారు డ్రైవింగ్‌ వచ్చిన వారిలో చాలా మంది స్పోర్ట్స్‌ కార్లను ఇష్టపడతారు. కానీ, వాటి ఖరీదు రూ.కోట్లలో ఉంటుంది. సంపన్నులు మాత్రమే సొంతం చేసుకోగల ఈ కార్లను సామాన్యులు నడిపించడం గగనమే. అందుకే తానే సొంతగా సాధారణ కారును లంబోర్గిని కారుగా మార్చేశాడు అసోం రాష్ట్రానికి చెందిన ఓ మెకానిక్‌.

కరీంగంజ్‌ జిల్లాలోని భంగా ప్రాంతానికి చెందిన నురుల్‌ హక్‌ స్థానికంగా కారు మెకానిక్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అతడికి విలాసవంతమైన స్పోర్ట్స్‌ కార్లు.. ముఖ్యంగా లంబోర్గిని కారంటే ఎంతో ఇష్టమట. కానీ, దాన్ని కొనుగోలు చేసే స్థోమత అతడికి లేదు. దీంతో ఓ పాత మారుతీ కారులో మార్పులు చేసి లంబోర్గిని కారులా మార్చుకున్నాడు. ఇటీవల కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కస్టమర్లు లేక మెకానిక్‌ షాపును మూసివేయాల్సి వచ్చింది. ఇంటి వద్దే ఖాళీగా ఉన్న నురుల్‌కు లంబోర్గిని కారుపై మనసు పడింది. దాని గురించే ఆలోచిస్తున్న అతడికి అసలైన కారు కొనలేకపోయినా అలాంటి మోడల్‌తో లంబోర్గిని కారును తయారు చేసుకోవచ్చు కదా అన్న ఉపాయం తట్టింది. వెంటనే తన పనులు మొదలుపెట్టాడు.


(Photo: nurul hauqe insta)

పాత మారుతీ స్విఫ్ట్‌ కారులో అవసరమైన మార్పులు చేసి, లంబోర్గిని కారులో ఉండే ఫీచర్లన్నీ అమర్చాడు. అదనంగా అవసరమైన విడి భాగాలు, ఇతర వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకున్నాడు. కారులో భారీ మార్పులు ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడట. దాదాపు రూ.6.8లక్షలు ఖర్చు పెట్టి.. 8నెలలు శ్రమించి తన కలను నిజం చేసుకున్నాడు. చూడటానికి అచ్చం లంబోర్గిని కారులాగే కనిపించేలా చేశాడు. త్వరలో మరో కారును ఫెర్రారీలా మార్చనున్నట్లు నురుల్‌ చెప్పుకొచ్చాడు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని