‘పుదుచ్చేరి ఎన్నికలు వాయిదా వేయొచ్చా?’

తాజా వార్తలు

Updated : 27/03/2021 04:39 IST

‘పుదుచ్చేరి ఎన్నికలు వాయిదా వేయొచ్చా?’

ఈసీని అడిగిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆధార్‌ డేటాను ఎన్నికల ప్రచారం కోసం భాజపా వాడుతోందన్న ఆరోపణలపై మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని వ్యాఖ్యానించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు అవసరమైతే ఏప్రిల్‌ 6న జరగాల్సిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయొచ్చా అని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) అడిగింది.

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఓటర్ల ఆధార్‌ డేటాను భాజపా వినియోగిస్తోందని, వందల వాట్సాప్‌ గ్రూప్‌లూ ఏర్పాటు చేసిందంటూ డెమోక్రటిక్‌ యూత్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆనంద్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ సంజీమ్‌ బెనర్జీ, జస్టిస్‌ సేంతికుమార్‌ రామమూర్తి విచారణ చేపట్టారు. ఎన్నికల వాయిదా గురించి ఈసీ అభిప్రాయాన్ని కోరారు. దీనికి ఈసీ తరఫు న్యాయవాది రాజగోపాలన్‌ సమాధానమిస్తూ.. కేవలం ఆరోపణలతో ఎన్నికలను వాయిదా వేయలేమని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు భాజపాకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. దర్యాప్తు కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగించాలని, విచారణ ఎంతవరకు వచ్చిందో ఈ నెల 31న నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఈసీకి ఆదేశాలిచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని