వివేకా హ‌త్యకేసులో 17వరోజు సీబీఐ విచారణ

తాజా వార్తలు

Updated : 23/06/2021 14:13 IST

వివేకా హ‌త్యకేసులో 17వరోజు సీబీఐ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 17వ రోజు ఆరుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. కడప ఆర్ అండ్ బీ అతిథి గృహం, కేంద్ర కారాగారం అతిథి గృహంలో రెండు చోట్ల అనుమానితులను విచారిస్తున్నారు. కడప ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పులివెందుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైకాపాకు చెందిన కృష్ణయ్య యాదవ్, సావిత్రి దంపతులు, వారి కుమారులు సునీల్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, కుమార్తె నందినిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ వీరిని విచారించారు. సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వివేకాకు అత్యంత సన్నిహితుడుగా ఉండే వాడని సమాచారం. గతంలో ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రెండు వారాల వ్యవధిలో మూడు దఫాలుగా ఈ కుటుంబాన్ని సీబీఐ ప్రశ్నిస్తోంది. కాగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తోంది. ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లి రెండు నెలల పాటు సీబీఐ ప్రశ్నించింది. మరోమారు విచారిస్తుండటం చర్చనీయాంశమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని