దేశ భ‌ద్ర‌త‌లో వాయుసేన కీల‌కం: బదౌరియా
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 12:21 IST

దేశ భ‌ద్ర‌త‌లో వాయుసేన కీల‌కం: బదౌరియా

హైద‌రాబాద్: దేశ భ‌ద్ర‌త‌లో వాయుసేన కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బదౌరియా అన్నారు. హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్‌ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న మాట్లాడారు. అంత‌కముందు ఆయ‌న క్యాడెట్ల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. 20,500 గంట‌ల‌ ఫ్ల‌యింగ్ శిక్ష‌ణ‌ను ఈ బ్యాచ్ పూర్తి చేసింద‌న్నారు. వైమానిక ద‌ళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నార‌ని తెలిపారు. 

వీరిలో బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండ‌టం మంచి ప‌రిణామం అని బ‌దౌరియా చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శిక్ష‌కుల‌కు, ఇతర సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. దేశం కోసం త్యాగం చేయ‌డ‌మే ఫ్ల‌యింగ్ అధికారుల ల‌క్ష్య‌మ‌న్నారు. క‌రోనా వేళ దేశ వ్యాప్తంగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో వైమానిక‌ ద‌ళం కీల‌క‌పాత్ర పోషించింద‌ని బ‌దౌరియా వివ‌రించారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని