ఏపీ అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షలు
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 15:41 IST

ఏపీ అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షలు

ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్‌

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడి ఘటనలో జవాన్ల మృతి ఘటనపై ఏపీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీకి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఈ సందర్భంగా జగన్‌ పేర్కొన్నారు.

బీజాపూర్‌- సుకుమా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన రౌతు జగదీశ్‌ మృతిచెందారు.

చంద్రబాబు సంతాపం

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందడం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు నేల ఇద్దరు ముద్దు బిడ్డలను పోగొట్టుకోవడం దురదృష్టకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని