​​​​​​పులివెందుల ప్రజలు నా కుటుంబ సభ్యులు

తాజా వార్తలు

Updated : 08/07/2021 19:30 IST

​​​​​​పులివెందుల ప్రజలు నా కుటుంబ సభ్యులు

కడప: పులివెందుల ప్రజలు తనకు ఎప్పుడూ కుటుంబ సభ్యులేనని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఇక్కడి ప్రజల దీవెనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. నాన్న చనిపోయినా ఇక్కడి ప్రజలు తనను వీడలేదని, ఇక్కడి ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జగన్‌ అన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన ఆయన.. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

నాన్న పుట్టినరోజున రైతు దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్‌ అన్నారు. వైఎస్‌ మరణించాక పులివెందుల అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే తనకే ఆశ్చర్యం కలుగుతోందని చెప్పారు. పులివెందుల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కానీ కొందరు వీటిని అడ్డకునేందుకు కోర్టులకెళ్లడం బాధకరమన్నారు. నియోజకవర్గంలో నిరంతరం తాగునీరు, మౌలిక వసతుల కల్పన, రింగురోడ్డు నిర్మాణ పనుల పూర్తి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. యవతీ, యువకులు ప్రత్యేకంగా నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ ట్రైనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో నిరంతరం తాగునీటి కోసం రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణం చేపడుతున్నాని తెలిపారు. 2023 నాటికి మెడికల్‌, నర్సింగ్‌ కళాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. పులివెందుల సభ అనంతరం పులివెందుల నుంచి జగన్‌ ఇడుపుల పాయకు బయల్దేరారు. వైఎస్‌ ఘాట్‌ వద్ద తన సతీమణితో కలిసి తండ్రికి నివాళులర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని