ఉన్నత విద్యాశాఖపై సీఎం సమీక్ష

తాజా వార్తలు

Published : 13/02/2021 01:44 IST

ఉన్నత విద్యాశాఖపై సీఎం సమీక్ష

అమరావతి: ప్రైవేటు వర్సిటీలు పెట్టేవారికి అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత కళాశాలలను వర్సిటీలుగా మార్చాలంటే ప్రమాణాలు తప్పనిసరి అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని 200 అత్యు్త్తమ విద్యాసంస్థలతో సర్టిఫికేషన్‌ ఉండాలని చెప్పారు. నిబంధనలతో అనుమతి ఇవ్వడానికి దీనినే అర్హతగా పరిగణించాలన్నారు.ఉన్నత విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు వర్సిటీ యాక్ట్‌ సవరణ పెట్టాలని సీఎం నిర్ణయించారు.ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీ యాక్ట్‌-2000 సవరణపై చర్చించారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్ట సవరణ ప్రతిపాదించాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ ప్రతిపాదనపై చర్చించారు. 

ఎయిడెడ్‌ కళాశాలల నిర్వహణపైనా సమావేశంలో కీలక చర్చ జరిగింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు చేతిలో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అన్ని డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల మాదిరి ఆంగ్లంలో బోధించాలని నిర్ణయించారు. ఆంగ్ల మాధ్యమం వల్ల ఇబ్బందులు రాకుండా తగిన కోర్సులు తేవాలని ఆదేశించారు. దీనికోసం డిగ్రీ మొదటి ఏడాదిలో తగిన కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు.

ఇదీ చదవండి
మూడో దశ.. ఏపీలో ఏకగ్రీవాల జోరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని