CM Kcr: పోడు సాగుదారులకు అడవి అంచున భూమి కేటాయిస్తాం: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 09/10/2021 23:11 IST

CM Kcr: పోడు సాగుదారులకు అడవి అంచున భూమి కేటాయిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం దిశగా ప్రగతిభవన్‌లో పోడు భూముల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరక్టర్ రాజారావు, గిరిజన శాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 అటవీ పరిరక్షణ కమిటీలను నియమించేందుకు విధి విధానాలు తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి అటవి అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అలా తరలించిన వారికి ధ్రువపత్రాలు ఇచ్చి వ్యవసాయానికి నీటి సౌకర్యం, విద్యుత్‌ వంటి వసతులు కల్పించి, రైతుబంధు, రైతు బీమా పథకాలను కూడా వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.  ‘‘ మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ కూడా పెరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తున్న ఫలితాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరిత నిధికి విశేష స్పందన వస్తోంది. శాసనసభలో ప్రభుత్వం మాట ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల సమస్యల పరిష్కారానికి అక్టోబరు మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పోడుభూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలి. దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేలా చర్యలు చేపట్టాలి’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని