తెలంగాణలో కొలువుల జాతర

తాజా వార్తలు

Updated : 09/07/2021 18:55 IST

తెలంగాణలో కొలువుల జాతర

హైదరాబాద్‌: తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్‌ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.... ‘‘గత పాలకుల హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం లభించకపోవడంతో ఇంతకాలం జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌)  అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్ధం చేసి కేబినెట్‌ సమావేశానికి తీసుకురండి’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 13న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని