కడుపుబ్బ నవ్వించిన సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 05/07/2021 00:56 IST

కడుపుబ్బ నవ్వించిన సీఎం కేసీఆర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం అంటేనే పంచ్‌లు.. ప్రాసలేకాదు.. కామెడీ కూడా ఉంటుంది. సిరిసిల్ల బహిరంగ సభలో నవ్వుల పువ్వులు పూయించారు ముఖ్యమంత్రి. ‘‘భోజన సమయానికి అన్నం పెడతారా? లేక ఇలానే పంపిస్తారా. ఎందుకంటే అక్కడ.. అక్కడక్కడ నాకు మోసం అయింది. ఓసారి వరంగల్‌ టౌన్‌లో అట్లనే జరిగింది. నాలుగు గంటల దాకా పనిచేయించుకుని నమస్కారం అన్నారు. కారెక్కిన తర్వాత మాకు ఆకలి అవుతుంటే యశ్వంతాపూర్‌ వాగు వద్ద చిన్న హోటల్‌ కనిపించింది. అక్కడ ఓ తల్లి పెరుగు అన్నం పెడతా బిడ్డా అని ఆకలి తీర్చింది’’ అని అక్కడక్కడ తనకు ఎదురైన అనుభవాలను చెబుతూ జోకులు పేల్చారు.

సిరిసిల్లకు వైద్య కళాశాల మంజూరు చేయాలన్న కేటీఆర్‌ విజ్ఞప్తికి బదులిచ్చిన ముఖ్యమంత్రి సభలో నవ్వులు పూయించారు. ‘‘సిరిసిల్లకు మస్తు ఇచ్చిండ్రు. ప్రారంభోత్సవానికి వస్తే చాలు. ఏమీ అడగనని చెప్పిన రామారావు ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్‌ కాలేజీ దుకాణం పెట్టారు’’ అని  ఛలోక్తులు విసిరారు. సిరిసిల్లకు మెడికల్‌ కాలేజీ వందశాతం వస్తది అందులో డౌట్‌ లేదు, వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని