KCR: గాంధీలో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

తాజా వార్తలు

Updated : 19/05/2021 16:14 IST

KCR: గాంధీలో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్ కుమార్‌తో కలిసి ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డు, ఓపీ వార్డులను కేసీఆర్‌ సందర్శించారు. ఐసీయూలో ఉన్న రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడి జూనియర్‌ వైద్యులు, ఇతర సిబ్బందిని సీఎం అభినందించారు. 

గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై అక్కడి వైద్యులతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సుమారు 40 నిమిషాలపాటు సీఎం గాంధీ ఆస్పత్రి పర్యటన కొనసాగింది.  ప్రస్తుతం  కేసీఆర్‌ వద్దే వైద్య ఆరోగ్యశాఖ ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. 

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని