‘కరోనా మాత’ ఆలయం ధ్వంసం
close

తాజా వార్తలు

Published : 12/06/2021 23:45 IST

‘కరోనా మాత’ ఆలయం ధ్వంసం

ప్రతాప్‌గఢ్‌: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టాలని కోరుకుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని జుహి శుక్లాపుర్‌ ప్రజలు నిర్మించిన కరోనా మాత అలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. పోలీసులే ఆలయాన్ని నేలమట్టం చేశారంటూ స్థానికులు ఆరోపించారు. కానీ స్థానికుల ఆరోపణలను పోలీసుల తోసిపుచ్చారు. ఆ ఆలయం వివాదాస్పద స్థలంలో నిర్మించినట్టు తెలిపారు. ఆ వివాదంతో సంబంధమున్న వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

కరోనా మాత ఆలయాన్ని ఈ నెల 7న లోకేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి స్థానిక దాతల సహకారంతో నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు. కరోనా మాత విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించి.. అదే గ్రామానికి చెందిన రాధే శ్యామ్‌ వర్మను పూజారిగా నియమించారని వివరించారు. ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్‌ కుమార్‌, నగేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ, జైప్రకాశ్‌ శ్రీవాస్తవ ఉమ్మడి ఆస్తి. అయితే, ఆలయం నిర్మించిన తర్వాత లోకేశ్‌ కుమార్‌ నోయిడాకు వెళ్లిపోయాడు. ఆలయ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నగేశ్‌.. సంగీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని ఆక్రమించుకునేందుకే ఆలయాన్ని నిర్మించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని